దుబాయ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ్స్ రాజస్థాన్ రాయల్స్

వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ 33వ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో బెంగళూరు ప్రస్తుతం 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా రాజస్థాన్‌ 6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే స్టీవ్‌స్మిత్‌ టీమ్‌ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలుపొంది రాజస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించింది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయంపై ఆసక్తి పెరిగింది. ఆల్సొ ఋఏద్ – ఈఫ్ళ్ 2020: నేడు రాజ‌స్థాన్‌కు చావోరేవో.. కోహ్లీ సేనతో ఢీ.. ఇక బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌లో రెండు మార్పులు చేశారు. శివం దుబే స్థానంలో షాబాజ్ అహ్మద్, సిరాజ్ స్థానంలో గురుకీరట్ సింగ్ మాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. షాబాజ్ అహ్మద్‌కు ఇదే ఐపీఎల్ అరంగ్రేట మ్యాచ్ కావడం విశేషం.