‘ఎఫ్3’ లో వెంకీ వరుణ్ తో పాటు సునీల్

వాస్తవం సినిమా:టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం తెలిసిందే. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక ప్లాప్ లేని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా తన నెక్స్ట్ సినిమా ఎఫ్3′ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో తెరకెక్కించిన “ఎఫ్2” కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా కోసం హీరో వెంకీ వరుణ్ తేజ్ లతో పాటు కమెడియన్ సునీల్ ని కూడా అనిల్ రావిపూడి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎఫ్2’ని మించిపోయే విధంగా ఎఫ్3’ని తెరకెక్కించాలని… కామెడీ సన్నివేశాలు అత్యధికంగా ఉండే రీతిలో స్క్రిప్ట్ ఉంచుకోవడంతో అనిల్ రావిపూడి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఫిలిం నగర్ టాక్.