రాజశేఖర్ – జీవిత లకు కరోనా పాజిటివ్

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు చాలామంది దీని బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా అనేకమంది ప్రముఖులకు కరోనా సోకగా.. చికిత్స తీసుకొని బయటపడ్డారు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ జంట రాజశేఖర్ – జీవిత లకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. రాజశేఖర్ – జీవిత దంపతులకు వారం రోజుల క్రితమే కరోనా సోకగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది.

తాజాగా రాజశేఖర్ తన ఫ్యామిలీకి కరోనా సోకిందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ”నాకు జీవిత మరియు పిల్లలకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించబడిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని వస్తున్న వార్తలు నిజమే. పిల్లలు ఇద్దరూ దాని నుండి పూర్తిగా బయటపడ్డారు. జీవిత మరియు నేను చాలా బాగున్నాము. త్వరలో ఇంటికి తిరిగి వస్తాము! ధన్యవాదాలు!” అని రాజశేఖర్ ట్వీట్ చేశాడు.