భారీ వర్షాలకు కుప్పకూలిన గోల్కొండ కోట గోడ

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది.

పంట పొలాలు, ఇండ్లు నీట మునిగాయి. కొన్ని చారిత్రక కట్టడాలు కూడా కూలిపోయాయి. ఇటీవలే జనగామ జిల్లాలోని సర్వాయి పాపన్న కట్టించిన చారిత్రక కోట ధ్వంసం అయింది. తాజాగా హైదరాబాద్‌కే తలమానికంగా మారిన గోల్కొండ కోటకు కూడా ఈ ప్రభావం తప్పలేదు. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తయిన కోటలోని ఓ గొడ ఒక్కసారిగా కూలిపోయింది. పర్యాటకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అధికారులు తదుపరి చర్యలను ప్రారంభించారు.