పెళ్లి విషయంలో అమ్మాయిల వయస్సుకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్న మోడీ సర్కార్..!!

వాస్తవం ప్రతినిధి:  దేశంలో 18 సంవత్సరాల వయస్సు వస్తే చాలు ఆడపిల్ల పెళ్లి చేసుకోవచ్చు అనేది చట్టం చెబుతోంది. అయితే ఇటీవల ఎక్కువ శిశుమరణాలు మరియు మాతృ మరణాలు 18 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటున్నా సంభవిస్తున్న నేపథ్యంలో మోడీ సర్కార్.. ఆడపిల్ల పెళ్లి వయసు కు సంబంధించి మూడు నాలుగు సంవత్సరాలు పెంచే యోచనలో ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర శిశు సంక్షేమ శాఖ అధ్యయనం చేసేందుకు రెడీ అయింది. అమ్మాయి ఏ వయసులో పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్ల మరియు తల్లి ఆరోగ్యంగా ఉంటారు అన్నదానిపై అధ్యయనం చేయటం ప్రస్తుతం జరుగుతోంది. మరోపక్క దేశంలో అన్ని రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్న తరుణంలో ఖచ్చితంగా చట్టంలో మార్పులు రావాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఎక్కువగా పెద్ద చదువులు చదువుతున్న అమ్మాయిలకు పెళ్లి అడ్డంకిగా ఉంటున్న తరుణంలో.. ఎలాగైనా 18కి మూడు గాని నాలుగు సంవత్సరాలు కలిపే యోచనలో అనగా 21 లేదా 22 వయసు వచ్చిన నాటి నుండి ఆడపిల్లలకు పెళ్లి అనే చట్టాన్ని తీసుకురావడానికి మోడీ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. .