సైలెంట్ గా జగన్ ని టార్గెట్ చేయబోతున్న ఏపీ కాంగ్రెస్..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నాయకులతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయినట్లు… ఏపీలో చాలా మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ లోకి రావటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావడం జరిగాయి. కాని తరువాత కాంగ్రెస్ ఉసే వినపడలేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు జాతీయస్థాయిలో త్వరలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడంతో వెంటనే అలర్ట్ అయినట్లు టాక్. దీంతో ఇప్పుడు వైయస్ జగన్ ని టార్గెట్ చేసి విమర్శలు చేయడానికి ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తులసి రెడ్డి, అధ్యక్షుడు శైలజానాథ్ అదేవిధంగా సుంకర పద్మశ్రీ వంటి నాయకులు ఇటీవల విమర్శలు స్టార్ట్ చేయడం జరిగిందట.

ఇప్పటికే అమరావతి కి సంబంధించి జగన్ ని టార్గెట్ చేసి భారీ స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకోవటానికి రెడీ అవుతున్నట్లు త్వరలోనే మరిన్ని వ్యూహాలతో వైసిపి పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది అన్న టాక్ గట్టిగా వస్తుంది. అంతేకాకుండా ప్రత్యేక హోదా నినాదాన్ని ఆధారం చేసుకుని ఏపీ కాంగ్రెస్ జగన్ ని ఇరికించే రీతిలో వ్యూహాలు పన్నుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.