అంత సీన్ ఎవరికీ లేదు అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆగ్రహం..!!

వాస్తవం ప్రతినిధి: వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కి వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. తాజాగా పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్టేషన్ కమిటీ చైర్మన్ పదవి నుండి పార్టీ తొలగించడం జరిగింది. రఘురామకృష్ణంరాజు స్థానంలో ఆ పదవిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కి కేటాయించడం జరిగింది. అయితే తాజాగా దీనిపై స్పందించిన రఘురామకృష్ణంరాజు ఎవరూ తనని తొలగించ లేదని… తొలగించలేరు కూడా అంటూ వ్యాఖ్యానించారు. మూడు నెలల క్రితమే వైసిపి ఎంపీలు అందరూ కలిసి లో సభ స్పీకర్ కి తనని ఆ పదవి నుండి తొలగించాలని లెటర్ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ పదవి అనేది ఈ ఏడాది కాలం పాటు ఉంటుందని మధ్యలో తొలగించటం కుదరదని ఆ సమయంలో స్పీకర్ చెప్పారని అన్నారు. అయితే ఇప్పుడు నా పదవీ కాలం అయిపోయింది కాబట్టి మరో ఎంపీ బాలశౌరి కి పార్టీ పదవి ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తనని పదవి నుండి తీసే అంత సీన్ ఎవరికీ లేదని రఘురామకృష్ణంరాజు తన పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు క్లారిటీ ఇచ్చారు.