ఇంకోసారి పొరపాటు జరగదు అంటున్న చంద్రబాబు..!!

వాస్తవం ప్రతినిధి: టిడిపి అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలతో వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉండే పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాలు టిడిపి జెండాలు మోశారు. ఇంకా మోస్తూనే ఉన్నారు. మిమ్మల్ని ఎన్నటికీ ఎప్పటికి మరువలేము…కచ్చితంగా తగిన సమయంలో పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తాము అంటూ చెప్పుకొచ్చారు.

గతంలో జరిగిన పొరపాటు జరగదు అని ఈ సమావేశంలో పార్టీ నాయకులకు చంద్రబాబు చెప్పినట్లు టాక్. అంతేకాకుండా ఇటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి సైనికుల్లా పనిచేస్తున్న కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టి, ఆర్థికంగా దెబ్బతీసి టీడీపీని బలహీన పరచాలని ముఖ్యమంత్రి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడన్నారని కూడా ఈ సమావేశంలో తెలిపారు. ఖచ్చితంగా మంచి రోజులు భవిష్యత్తులో ఉంటాయని ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.