రాష్ట్రంలో పాలన ఎలా ఉందో ఈ ఒక్క విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చు: కోదండరాం

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో బాధ్యత రహిత, నిరంకుశ పాలన కొనసాగుతోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలోని ఎన్‌జీ కళాశాలలో పట్టభద్రుల ఓటు నమోదుపై మార్నింగ్ వాకర్లతో కోదండరాం ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఓపక్క రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తీరిగ్గా హార్టికల్చర్ మీద సమీక్షలు నిర్వహిస్తున్నారని ,రాష్ట్రంలో పాలన ఎలా ఉందో ఈ ఒక్క విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజా ధనాన్ని దోచుకునేందుకు ప్రభుత్వం పథకం వేసిందని, డబ్బులు చెల్లించకుంటే ఆస్తులన్నీ అక్రమమేనన్నట్టు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులందరూ ఆలోచించి ఓటు వేయాలని కోదండరాం కోరారు. పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు.