అమెరికాలో దారుణం.. ఒళ్ళు గగురుపొడిచే ఘటన ..!!

వాస్తవం ప్రతినిధి: ఒళ్ళు గగురుపొడిచే ఘటన ఒకటి అగ్రరాజ్యంలో జరిగింది. ఒక నిండు గర్భిణిని చంపి ఆమె కడుపులో నుంచి బిడ్డను తీసుకుంది ఒక మహిళ. టేలర్‌ పార్కర్‌(27) అనే మహిళ గత బుధవారం వరకు టెక్సాస్‌ జైలులో ఉంది. అయితే గత గురువారం నాడు 5 మిలయన్‌ డాలర్ల పూచికత్తుతో ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె మరో ఘాతుకానికి పాల్పడింది. ఒక గర్భిణిని చంపి ఆమె బిడ్డను తనకు పుట్టిన శిశువుగా తీసుకొని ఆసుపత్రికి తీసుకొని వచ్చింది.తనకు రోడ్డు పక్కన కానుపు అయ్యిందని ఆసుపత్రిలో వారికి కట్టుకథలు చెప్పింది. శిశువు శ్వాస తీసుకోవడం లేదని వెంటనే చికిత్స అందించాలని కోరింది. బిడ్డను పరిశీలించిన డాక్టర్లు ఆమె మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పార్కర్‌ను నిలదీయగా అసలు విషయం బయట పెట్టింది.