సానుకూల ఫలితాలు ఇస్తున్న చైనా వ్యాక్సిన్..!

వాస్తవం ప్రతినిధి: చైనా అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్లలో కీలకమైన సీఎన్‌బీజీ వ్యాక్సిన్‌పై తాజాగా నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వెల్లడయ్యాయి. వాలంటీర్లపై చేపట్టిన తాజా పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని సీఎన్‌బీజీ వెల్లడించింది. ప్రాథమిక, మధ్యస్ధాయి మానవ పరీక్షలో వ్యాక్సిన్‌ డోసు తీసుకున్న వారిలో వ్యాధి నిరోధకత మెరుగైందని పేర్కొంది. మూడవ దశ పరీక్షల్లోకి ప్రవేశించిన ప్రపంచంలోని ప్రముఖ పది కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. ఇక ప్రపంచం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై అంతర్జాతీయ సహకారం అవసరమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) స్పష్టం చేసింది.