రీ ఎంట్రీ సినిమా కన్ఫామ్ చేసిన రేణూ దేశాయ్..!!

వాస్తవం సినిమా: పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ చాలావరకూ పూనే రాష్ట్రంలోనే ఉండటం జరిగింది. పిల్లలతో అక్కడే ఉంటూ అడపాదడపా హైదరాబాదులో పలు షోలలో రాణించడం జరిగింది. అయితే సినిమా రీ ఎంట్రీ విషయంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు అప్పట్లో చేయడం సంచలనం సృష్టించింది. “బద్రి” సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 20 సంవత్సరాలు అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రేణుదేశాయ్ పూరి జగన్నాథ్ తో మాట్లాడుతూ.. మీ అప్ కమింగ్ మూవీస్ లో ఓ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను అని రేణు కోరడం జరిగింది. ఖచ్చితంగా ఇస్తానని డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమాలో రేణు దేశాయ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిలో వాస్తవం లేదని రేణు కొట్టిపారేయడం జరిగింది. కానీ ఇదిలా ఉండగా దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్లీ రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి అంగీకారం తెలపడమే కాకుండా ఆద్య అనే సినిమాకి సంతకం కూడా చేసినారు. ‘ఆధ్య’ లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో రేణు దేశాయ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నందిని రాయ్ .. కబాలి ఫేమ్ సాయి ధన్సికతో పాటు బాలీవుడ్ నటుడు వైభవ్ తత్వావాడీ నటించారు. ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హుషారు ఫేమ్ తేజ కూరపాటి.. గీతిక రతన్ యువ జంటగా నటించనున్నారు. ఆసక్తికరంగా రేణు కుమార్తె పేరు “ఆద్య”. అదే పేరుతో రీఎంట్రీ సినిమాలో నటిస్తుండడం విశేషం.