వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ కీలక అడుగు..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అప్పట్లో అనేక సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారం ప్రారంభం లో జరిగిన ఈ హత్య ..అధికారంలో ఉన్న టీడీపీని అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ని ఇరుకునపేట్టి నట్లయింది. కావాలని జగన్ తన బాబాయ్ ని చంపించడం జరిగిందని…, ఆ సానుభూతితో కడపలో ఓట్లు సంపాదించాలని ప్లాన్ వేసినట్లు టిడిపి నాయకులు అప్పట్లో ఆరోపించారు. ఇదే తరుణంలో వైసీపీ నేతలు అధికారంలో ఉన్న టిడిపి పార్టీ యే ఈ హత్య చేయించినట్లు ఆరోపించారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇలాంటి తరుణంలో వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత..జరిగిన హత్య విషయంలో తనకు అనేక అనుమానాలు ఉన్నట్లు హైకోర్టు ని ఆశ్రయించడంతో ఈ కేసుని సీబీఐకి హైకోర్టు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా విచారణ చేస్తున్న సిబిఐ అనేక మంది అనుమానితులను విచారణ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా విచారణలో సిబిఐ కీలక అడుగు ముందుకు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే హత్య జరిగిన స్థలములో కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా కేసును జెట్ స్పీడుతో దర్యాప్తు చేస్తున్న సి.బి.ఐ బృందానికి హత్యకు ఉపయోగించిన కొన్ని ఆయుధాలు లభించినట్లు టాక్. దీంతో సీబీఐ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించి.. కేసును హత్య కేసు గా మార్పు చేసి దర్యాప్తును వేగవంతం చేసి వెంటనే చార్జిషీట్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం వ్యక్తిగత వ్యవహారాల వల్లే వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడినట్లు అధికారులు గుర్తించినట్లు టాక్. హత్య జరిగిన రోజు నుంచి అంతకుముందు మూడు నెలలుగా వివేకానందరెడ్డి కాల్ లిస్ట్ సేకరించిన సిబిఐ…, దానిలో కీలకమైన వ్యక్తులు అందరిని విచారించింది. సెటిల్ మెంట్ వ్యవహారాలు అదే విధంగా కుటుంబ పరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయట. దీంతో త్వరలోనే ఈ కేసుకు సంబంధించి కీలకమైన విషయం బయటపడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.