ఫోన్ చేసి అధికారులకు రోడ్డు మీదే వార్నింగ్ ఇచ్చిన కిషన్ రెడ్డి..!!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల కుండపోత వర్షం కురియడంతో హైదరాబాద్ నగరం మొత్తం జలమయమైన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ జలమయం కావడంతో పాటుగా విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బ తినడం జరిగింది. వర్షం నీళ్ళు ఇళ్లల్లోకి రావడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి నగరంలో ముప్పు ప్రాంతాలలో పర్యటించారు. అయితే తన పర్యటనలో ప్రభుత్వ అధికారులు ఆర్టీవో అదేవిధంగా ఎమ్మార్వో వంటి వారు కూడా లేకపోవడంతో, ప్రోటోకాల్ పాటించకుండా ఉండడంతో వెంటనే సీరియస్ అయ్యారు. సదరు అధికారులకు ఫోన్ చేసి రోడ్డు మీదే వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అధికారులు అందుబాటులో లేకపోతే దేనికి అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ… మమ్మల్ని ఢిల్లీ కి వెళ్ళిపో మంటారా అని చీవాట్లు పెట్టారు. అదేవిధంగా ముంపు ప్రాంతాలలో ఉన్న బాధితులకు భరోసా ఇచ్చి అందుబాటులో ఉన్న అధికారులకు బాధితులకు సరైన టైంలో ఆహారం మంచి నీరు అందేలా వెంటనే చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి సూచించారు.