మృగాలు రెచ్చి పోతుంటే జగన్ సైలెంట్ గా ఉండటం మంచిది కాదు అంటున్న లోకేష్..!!

వాస్తవం ప్రతినిధి: ఆడవాళ్లపై రోజురోజుకి అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా గాని మృగాళ్ల ఆలోచనలు మారటం లేదు. తాజాగా విజయవాడ నగరంలో క్రీస్తు రాజపురం కి చెందిన దివ్య తేజస్విని అనే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ని నాగేంద్ర బాబు అలియాస్ స్వామి అనే యువకుడు గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటనపై నారా లోకేష్ స్పందించారు. జరిగిన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఉన్న దివ్య ఓ ప్రేమోన్మాది చేతిలో బలి కావడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేదని…వరుస ఘటనలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వంలో చలనం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు వారం రోజుల వ్యవధిలోనే అరడజనుకు పైగా ఘటనలు రాష్ట్రంలో జరగడం దారుణమని అని వ్యాఖ్యానించారు. వరుసగా మృగాలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సైలెంట్ గా ఉండటం సరికాదని విమర్శించారు. చట్ట రూపం దాల్చని దిశ చట్టం, ఆర్భాటంగా ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లు, అధికారం లేని హోంమంత్రి… ఇక మహిళలకు న్యాయం జరిగేదెప్పుడు? అంటూ లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.