యుద్ధానికి రెడీ అవ్వండి అంటూ సైనికులకు పిలుపునిచ్చిన చైనా ప్రధాని..!!

వాస్తవం ప్రతినిధి: ఈ ఏడాది జూన్ మాసం నుండి చైనా – భారత్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గాల్వాన్ లోయలో భారత్ మరియు చైనా ఆర్మీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటంతో భారత్ ఆర్మీకి చెందిన జవాన్లు 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో చైనా ఆర్మీ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు.

పరిస్థితి ఇలా ఉండగా మొన్నటి వరకు భారత్ తో శాంతి చర్చలు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు యుద్ధమంటే ఇండైరెక్ట్ కామెంట్ చేస్తూ ఉంది.

పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గ్వాంగ్డాంగ్ మిలిటరీ బేస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి యుద్ధానికి సిద్ధం కావాలని తెలిపారు. దేశానికి విధేయంగా పనిచేయాలని సూచించారు. మీలో ఉన్న పూర్తి శక్తి సామర్ధ్యాలు దేశం కోసం వినియోగించాలని యుద్ధంపైనే కేంద్రీకరించాలని, మీ మనసును సైతం యుద్ధం వైపే నడిపించాలని చెప్పారు. అనుక్షణం అలర్ట్ గా ఉండాలని తెలిపారు. జిన్ పింగ్ చేసిన కామెంట్లు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఏ దేశాన్ని ఉద్దేశించి ఆయన చేశారు అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి.