దేశం మీకు అండగా ఉంటుంది అంటూ తెలంగాణకి ధైర్యం చెప్పిన రాష్ట్రపతి..!!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో వరదలు రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలు… నగరవాసులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రోడ్డు మీద వస్తే ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియక చాలా మంది గతంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఇటువంటి తరుణంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింధ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తమిళనాడు గవర్నర్ తమిళ సై , సీఎం కేసీఆర్ తో పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్, తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జరిగిన విధ్వంసం, ప్రాణ నష్టంపై రామ్‌నాథ్ విచారం వ్య‌క్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటుందని కోవింద్ పేర్కొన్నారు. అదే విధంగా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అవ్వాలి అని ఆదేశించినట్లు తెలిపారు.