పోలీస్ కంప్లైంట్ చేసిన బోండా ఉమా..!!

వాస్తవం ప్రతినిధి: విజయవాడ ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా హైదరాబాదులో పోలీస్ కంప్లైంట్ చేశారు. తన పై సోషల్ మీడియాలో లేనిపోని ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ పరువు తీసే విధంగా కొంతమంది కుట్ర పన్నుతున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక ప్రముఖ హోటల్ నుండి హీరోయిన్ తో తాను వస్తున్నట్లు ఓ ఫోటో… సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని పేర్కొన్నారు. అసలు ఆ హీరోయిన్ ఎవరో కూడా తనకు తెలియదు, ఆమెకి తన కి సంబంధం లేదు అని బోండా ఉమా చెప్పుకొచ్చారు. కావాలని ప్రత్యర్థులు ఈ విధంగా చేస్తున్నారని… దీంతో ప్రజలలో అనేక అనుమానాలు నెలకొన్నట్లు స్పష్టం చేశారు. వెంటనే ఈ కుట్ర వెనకాల ఎవరు ఉన్నారో పోలీసులు పట్టుకోవాలని, తగు చర్యలు తీసుకోవాలని బోండా ఉమా అన్నారు. ఇదే రీతిలో ఏపీలో మరి కొంతమంది టిడిపి నాయకుల విషయంలో సోషల్ మీడియాలో లేనిపోని పోస్టులు వైరల్ అవుతున్నట్లు కూడా ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. వారు కూడా కంప్లైంట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.