యూఏఈలో కొవిడ్-19 ఉధృతి.. ఒకేరోజు రికార్డుస్థాయి కేసులు..!!

వాస్తవం ప్రతినిధి: దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి మంగళవారం ఒకేరోజు యూఏఈలో రికార్డుస్థాయి కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 1,315 నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇంతకుముందు అక్టోబర్ 3న 1,231 కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలో తొలిసారి ఒక్కరోజే వెయ్యి కేసుల మార్క్ సెప్టెంబర్ 12న నమోదైంది. ఇక మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 97వేల కరోనా పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 11 మిలియన్లకు పైగా కొవిడ్ టెస్టులు నిర్వహించింది యూఏఈ. ఇక మంగళవారం దేశవ్యాప్తంగా నమోదైన 1,315 కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 1,08,608కు చేరింది.