కరోనా వ్యాక్సిన్‌పై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు..!

వాస్తవం ప్రతినిధి: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాపై పోరాటంలో తొలి తరం వాక్సిన్లతో ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొవని బిల్ గేట్స్ అంటున్నారు. మొదటి తరం వాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడే అవకాశం వుంటుందని , కాని చాలా వరకు క్లినికల్ ట్రయల్స్‌లో సక్సెస్‌గానే కనిపిస్తుందని, కానీ రియల్ వినియోగంలోకి వచ్చే సరికి కొన్నైనా సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే ప్రమాదం వుంటుందని గేట్స్ అంఛనా వేస్తున్నారు. తొలి తరంలో తలెత్తే సమస్యలను అధిగమించిన తర్వాత తయారయ్యే రెండో తరం వాక్సిన్ మరింత ప్రభావవంతంగా పని చేస్తుందని, దాంతో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు మెరుగుపడతాయని గేట్స్ అంటున్నారు.