పూజా హెగ్డే పుట్టినరోజు నాడు అదిరిపోయే గిఫ్ట్ అందించిన “రాధే శ్యామ్‌” సినిమా యూనిట్..!!

వాస్తవం సినిమా: అక్టోబర్ 13వ తారీకు పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ సరసన “రాధే శ్యామ్‌” సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థ వాళ్లు సినిమాలో పూజా హెగ్డే కి సంబంధించిన పిక్ రిలీజ్ చేశారు. ప్రేరణ పేరుతో విడుదలైన పూజాహెగ్డే పిక్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. స్కార్ఫ్ తో అదిరిపోయే లుక్ లో పూజా హెగ్డే స్టిల్ ఉంది. స్మైలీ ఫెస్ తో ఉన్న ఈ ఫోటో కి పూజా హెగ్డే అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం లో పూజా హెగ్డే నటిస్తున్నట్లు… సమాచారం.

ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న పూజా హెగ్డే.. పలు టాప్ ప్రాజెక్టులలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది సంక్రాంతి పండుగకు అలా వైకుంఠపురం లో సినిమాలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.