కరోనా వైరస్ ని తక్కువ అంచనా వేయొద్దు అంటున్న మోడీ..!!

వాస్తవం ప్రతినిధి:  దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న కొద్ది తగ్గుతున్న తరుణంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మహమ్మారి అసలు తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని చెప్పుకొచ్చారు. మంగళవారం మోడీ కేంద్ర మాజీ మంత్రి బాలాసాహెబ్  విఖే పాటిల్ ఆత్మకథను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

  ‘వ్యాక్సిన్ వచ్చే వరకూ అప్రమత్తత తప్పదు. భౌతిక దూరం పాటించాల్సిందే. కోవిడ్-19 నిబంధనలు విధిగా పాటించాలి.  వైరస్ ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నది.  మాస్క్లు వేసుకోవడం సోషల్ డిస్టెన్స్ పాటించడంలో కొందరు అలసత్వం చూపుతున్నారు. ఇది ఏమాత్రం తగదు. కరోనా ప్రమాదం కొనసాగుతోందని..  మహారాష్ట్రలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది’ అని ప్రధాని సూచించారు. గడిచిన కొద్ది రోజుల నుండి దేశంలో తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడంతో..  మిగతా రాష్ట్రాలు చాలా అలర్ట్ గా ఉండాలని మోడీ చెప్పుకొచ్చారు.