తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్న టిడిపి..??

వాస్తవం ప్రతినిధి:  ఇటీవల తిరుపతి ఎంపీ బాలి దుర్గాప్రసాద్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆరు నెలల్లో తిరుపతిలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో… ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితులు బట్టి పోటీకి దిగటం లేదని మొన్నటివరకు వార్తలు వచ్చాయి.

కానీ ఇటీవల తిరుపతి పార్లమెంట్ ఇంచార్జ్ ఎన్నిక విషయంలో టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో పాటు చాలామంది చుట్టుప్రక్కల సీనియర్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశం అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… తిరుపతి ఉప ఎన్నికలలో టిడిపి పోటీ చేస్తుందంటూ చెప్పుకొచ్చారు.

కారణం చూస్తే పార్టీ అంతర్గత సమావేశంలో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కావటంతో జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ కి బ్యాడ్ నేమ్ వస్తుందని..నాయకులు బాబుకి తెలపడంతో ఆయన కూడా ఓకే అన్నట్లు టాక్. దీంతో జరగబోయే ఎంపీ ఉప ఎన్నికల్లో టిడీపి కూడా పోటీకి దిగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.