ఆ రెండు పార్టీల నేతలు దేశ ప్రజలను  మూర్ఖులు అనుకుంటున్నారా? : ఢిల్లీ సీ ఎం   

వాస్తవం ప్రతినిధి: జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ మండిపడ్డారు. అవినీతి విషయం లో ఆ రెండు పార్టీల నూ  ఒకే మాదిరి చూడాలని అన్నారు.  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాలు వేరు కావచ్చని…స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ దోచుకుందని… ఇప్పుడు ఆ స్థానంలోకి బీజేపీ వచ్చిందని చెప్పారు. బీజేపీ పాలనలో పెద్ద స్థాయిలో అవినీతి చోటుచేసుకుంటోందని అన్నారు.

కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల జీవితాలను నాశనం చేస్తాయని… ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లులను రూపొందిస్తున్న సమయంలో సంబంధిత కమిటీలో ఉన్న ఒక కాంగ్రెస్ నేత బీజేపీని అభినందించారని… ఆ బిల్లులు చట్టరూపం దాల్చాక వాటిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలను వీళ్లంతా మూర్ఖులు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.