రాజ్యసభ ఎన్నికలు..షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

వాస్తవం ప్రతినిధి: యూపీ, ఉత్తరాఖండ్ లలో రాజ్యసభ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ లో యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకి సంబందించిన రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

యూపీలో 10, ఉత్తరాఖండ్ లో ఒక రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. అక్టోబర్ 20 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నవంబర్ 9న ఎన్నికలు జరుగనున్నాయి.

రిటైర్ అవుతున్న ప్రముఖుల్లో జావేద్ అలి ఖాన్, పి ఏల్ పునియా, కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి, రాంగోపాల్ యాదవ్, రాజ్ బబ్బర్ తదితరులు ఉన్నారు. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధిక బిజేపి సభ్యులు గెలుపొందే అవకాశం కనిపిస్తోంది.