భారత మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ కన్నుమూత!

వాస్తవం ప్రతినిధి: భారత మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ కార్ల్‌టన్ చంపాన్ మరణించారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. సోమవారం ఉదయం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. కార్ల్‌టన్ ఆదివారం రాత్రి తీవ్రమైన వెన్ను నొప్పితో బెంగళూరులోని ఓ ఆసుపత్రి లో చేరిన అయన గుండె పోటుతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కార్ల్‌టన్ మృతి పట్ల ఫుట్‌బాల్ దిగ్గజాలు సంతాపం ప్రకటించారు. కార్ల్‌టన్ మృతి దేశానికి తీరని లోటు అని ఆయన అభిమానులు అంటున్నారు.