బాలీవుడ్ ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ…!!

వాస్తవం సినిమా: వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బాలీవుడ్ ఇండస్ట్రీ ని టార్గెట్ చేశారు. ఇటీవల బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలన్నీ జాతీయ మీడియా పై ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ మీడియా కావాలని బాలీవుడ్ పరువు తీసేలా కథనాలు ప్రసారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్ డ్రగ్స్ కేసు విషయంలో అదేవిధంగా లైంగిక వేధింపులు అనే విషయాల గురించి డిబేట్ లు పెడుతూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ప్రసారం చేస్తున్నట్లు…తప్పుగా బాలీవుడ్ ఇండస్ట్రీని చిత్రీకరిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన 38 సంస్థలు, నాలుగు ప్రధాన అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేశాయి. ఇందులో అమీర్ ఖాన్ – షారుఖ్ ఖాన్ – సల్మాన్ ఖాన్ – అజయ్ దేవగణ్ – కరణ్ జోహర్ – ఆదిత్య చోప్రాకు చెందిన పలు సంస్థలున్నాయి. అయితే దీనిపై వర్మ తనదైన స్టైల్ లో కెమెంట్లు చేసాడు.”బాలీవుడ్ రియాక్షన్ చాలా ఆలస్యమైంది.. బాలీవుడ్ స్టార్ హీరోలందరూ డిల్లీ హైకోర్టు ముందుకు వెళ్లి స్కూల్ పిల్లల్లా టీచర్ వద్ద ‘టీచర్ టీచర్ అర్నబ్ మమ్మల్ని తిడుతున్నాడు’ అంటూ చెప్పినట్టుంది” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.