మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్న జగన్..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన అంటే చాలు ప్రతిపక్ష టీడీపీ లో వణుకు పుడుతుంది. వరుసగా రెండు సార్లు జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టిన తర్వాత ఇటీవల న్యాయవ్యవస్థ విషయంలో లొసుగులు ఉన్నట్లు, జగన్ ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లెటర్ రాయడం అటు జాతీయ మీడియాతో పాటు దేశంలోనే సంచలనం సృష్టించింది. ప్రస్తుతం జగన్ రాసిన లెటర్ దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది.

ఇలాంటి తరుణంలో జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈసారి రాష్ట్రపతి కోవింద్ తో బేటీ కానున్నారని సమాచారం. ఆ తర్వాత మోడీతో కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇద్దరు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మరో రెండు రోజుల్లో జగన్ ఢిల్లీ విమానం ఎక్కే అవకాశం ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.