సోషల్ మీడియా కేసులు సీబీఐ కి అప్పజెప్పిన హైకోర్టు..!!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల న్యాయ స్థానాలపై ఏపీలో ఉన్న కొన్ని పార్టీలు అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ట తగ్గించే రీతిలో విమర్శాత్మకమైన పోస్టులు పెట్టడం జరిగింది. దీంతో ఈ విషయంపై కోర్టు దృష్టి దాకా కొందరు తీసుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కు సంబందించిన పోస్టుల కేసును ఎపి హైకోర్టు సిబిఐ కి అప్పగించడం సంచలనంగా మారింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ కి సహకరించాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ హైకోర్టు దిక్కార నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసును సిబిఐ కి అప్పగించి, ఎనిమిది వారాలలో నివేదిక అందచేయాలని హైకోర్టు ఆదేశించింది.జడ్జిలను నిందించినవారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిణామంతో సోషల్ న్యాయ వ్యవస్థల పై పోస్టులు పెట్టిన పార్టీల కార్యకర్తలకు టెన్షన్ నెలకొన్నట్లు సమాచారం.