ఇక నెక్స్ట్ కవితకి మంత్రి పదవే నా..?? 

వాస్తవం ప్రతినిధి:   ఊహించిన రీతిలో టిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్.పి , ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవిత ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్,బిజెపి డిపాజిట్లు కోల్పోయాయి.823ఓట్లకు గాను 728 ఓట్లు కవితకు వచ్చాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలు కాగా , ఆ జిల్లా నుంచే ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యేలంతా కవిత విజయం కోసం కృషి చేశారు.ఈ ఎన్నిక సందర్భంగా బిజెపి, కాంగ్రెస్ లకు చెందిన కౌన్సిలర్లను పెద్ద ఎత్తున టిఆర్ఎస్ ఆకర్షించింది. ఈ పరిణామంతో వార్ వన్ సైడ్ అవటంతో కవిత సులువుగా విజయం సాధించింది. అయితే ఇది ఇలా ఉండగా ఎమ్మెల్సీగా కవిత విజయం సాధించడంతో ఆమెకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందా? మీడియాలో దీనికి సంబందించిన ఊహాగానాలు మొదలు అయ్యాయి. దానికి తగినట్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గణేష్ గుప్త, షకీ్ల్ , జీవన్ రెడ్డి లు మాట్లాడుతూ కవిత మంత్రి అవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ ఎమ్.పి ఎన్నికలలో ఓడిపోయిన కవిత కొంతకాలం అంత యాక్టివ్ గా లేరు. తదుపరి మళ్లీ పుంజుకుని ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపొందారు. ఆమకు మంత్రి వర్గంలో స్థానం లభిస్తే, కెసిఆర్ కుటుంబ సభ్యులు అంటే ఆయన పిల్లలు ఇద్దరూ మంత్రులు అయినట్లఅవుతుంది. ఇప్పటికే సిరిసిల్ల కు ప్రాతినిధ్యం వహిస్తున్న కెటిఆర్ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. పిల్లలు ఇద్దరు సమర్దులు కావడం, ఆయా భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండడం విశేషం.