ప్రతి పనికి హైకోర్ట్ అడ్డు పడుతోంది: సుప్రీంకోర్టు జడ్జి  కి జగన్ లేఖ!  

వాస్తవం ప్రతినిధి: ప్రతి పనికి హై కోర్ట్ అడ్డు పడుతోందంటూ  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాబ్డేకు   లేఖ రాశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తరువాత కూడా విచారణ జరపకుండా హై కోర్ట్ అడ్డుకుంటోందన్నారు.    ఈ లేఖ పై అక్టోబర్ 6 వ తేదీ ఉంది. ఈ లేఖను శనివారం సాయంత్రం సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లాం మీడియాకి విడుదల చేసారు. ఈ లేఖ మొత్తం 8 పేజీలు ఉంది. లేఖలో ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం జగన్.
  టాప్-2 సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తొందర్లోనే సుప్రీమ్ కోర్ట్ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావిస్తున్న సంగతి తెలిసిందే.  ఆయనపై  కురిపించారు. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు ఓ లేఖను సంధించారు. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ లో కొందరు న్యాయమూర్తులపై ఆయన ఒత్తిడి తెస్తున్నారంటూ సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.
అయితేతెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా ఎన్వీ రమణ వ్యవహరిస్తున్నారని ఈ మేరకు హై కోర్ట్ లోని న్యాయమూర్తులపై ఒత్తిడి తెస్తున్నారని సీఎం జగన్ లేఖలో ఆరోపించారు. అంతే కాకుండా ఎన్వీ రమణ ఇద్దరు కుమార్తెలు అమరావతిలో అక్రమంగా భూములు కొన్నారని, ఈ భూ లావాదేవీలపై ఎన్నో ప్రశ్నలు. అనుమానాలు ఉన్నాయన్నారు.
 2019 మే లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిందని, అయితే ఆ తరువాత గత ఐదేళ్ళలో జరిగిన ప్రభుత్వ లావాదేవీలపై విచారణకు ఆదేశించామన్నారు. ఆ తరువాత నుంచి రాష్ట్రంలోని న్యాయమూర్తులపై ఎన్వీ రమణ ఒత్తిడి తేవడం మొదలు పెట్టారని సీఎం జగన్ లేఖ లో పేర్కొన్నారు.
దీనితో ఇందుకు దమ్మాలపాటి శ్రీనివాస్ రావు పై నమోదు అయినా కేసు ఉదాహరణ అని సీఎం జగన్ లేఖ లో పేర్కొన్నారు..నేరపూరిత, మోసపు చర్యలపై విచారణలు కూడా నిలిచిపోతున్నాయని, వార్తలు రాయవద్దని మీడియాపైనా ఆంక్షలు విధిస్తున్నారని సీఎం జగన్ లేఖలో ఆరోపించారు. ఇలా ప్రతి దానికి స్టేలు ఇస్తుంటే, విచారణ జరగడం లేదని ఇకపైన అయినా సీజే కల్పించుకోవాలి అని అప్పుడే న్యాయమేంటో తెలుస్తుందని సీఎం జగన్ కోరారు.