క‌రోనా సంక్షోభం.. మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం..!

వాస్తవం ప్రతినిధి: కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసేందుకు అవకాశం కల్పిస్తున్న కంపెనీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంటి నుండి పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొంతమంది ఇకపై శాశ్వతంగా అదే విధానాన్ని కొనసాగించే ప్రత్యామ్నాయాన్ని వారి ముందుంచింది. అయితే, అన్ని రకాల ఉద్యోగులకు ఇది వర్తించదని స్పష్టం చేసింది.

క‌రోనా సంక్షోభం ఇంకా కొన‌సాగుతుండటంతో చాలా వ‌ర‌కు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇంటి నుంచే ప‌నిచేస్తున్నారు. అమెరికాలోని త‌న ఆఫీసుల‌ను జ‌న‌వ‌రి వ‌ర‌కు ఓపెన్ చేసేది లేద‌ని కూడా మైక్రోసాఫ్ట్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ ఉద్యోగులు శాశ్వ‌తంగా ఇంటి నుంచి ప‌నిచేయాల‌నుకుంటే, వాళ్లు ఆఫీసులో త‌మ స్పేస్‌ను వ‌దులుకోవాల్సి ఉంటుంద‌ని సంస్థ చెప్పింది. ప‌ర్మినెంట్ ప‌ద్ధ‌తిలో ఇంటి నుంచి ప‌ని చేయాల‌నుకున్న‌వాళ్లు త‌మ మేనేజ‌ర్ల నుంచి అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. కార్యాలయాలు తెరిచిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన ఇంటి నుంచే పని చేయాలనుకునే ఉద్యోగులు తమ మేనేజర్ల నుంచి అ నుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిసింది. మైక్రోసా ఫ్ట్‌ లాబ్స్‌లో పని చేసే వారు లేదా ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే వారు కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది.