కరోనా ఎఫక్ట్: ఉద్యోగాలు కోల్పోయిన 19వేల మంది ఎన్నారైలు..!!

వాస్తవం ప్రతినిధి: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను తీవ్రంగా దెబ్బ తీసింది. గల్ఫ్‌లో కూడా కొవిడ్ ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇక సౌదీలో కరోనా ప్రభావంతో ఏకంగా 19వేల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోయినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ గణంకాలు చెబుతున్నాయి.

రెండో త్రైమాసికం(Q2)లో ప్రైవేట్ సెక్టార్‌లలో కేవలం 32వేల మంది ప్రవాసులకు వర్క్ వీసాలు జారీ చేస్తే.. అదే మొదటి త్రైమాసికం(Q1)లో 3,42,000 వీసాలు జారీ అయినట్లు ఈ గణంకాల ద్వారా తెలుస్తోంది. కాగా, జారీ చేసిన వీసాల్లో 97 శాతం ఉపయోగించబడలేదు. మిగిన 3 శాతం వీసాలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ గణంకాలను బట్టి చూస్తే సౌదీలో ప్రవాసులపై మహమ్మారి ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపించిందో అర్థమవుతోంది.