బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటకు వచ్చేసిన గంగవ్వ  

వాస్తవం ప్రతినిధి: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది.   5ఐదు వారాలను పూర్తి చేసుకుంది.  ఓ వైపు ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుండగా మరో వైపు  అనుకోని విధంగా గంగవ్వ ఆరోగ్య కారణాల వల్ల హౌజ్ నుండి బయటకు వచ్చింది.
ఐదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌ ప్రక్రియ సాగుతుంది. ఎలిమినేషన్‌లో 9 మంది సభ్యులుండగా అందులో ఇద్దరు సేఫ్‌ అయ్యారు. ఒకరు ఈ వారం హౌస్‌ కెప్టెన్‌గా ఎన్నికైన సోహైల్‌ కాగా.. మరొకరు అఖిల్‌. అయితే అసలు ఎలిమినేషన్‌తో సంబంధం లేకుండా శనివారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి గంగవ్వ బయటకు వచ్చేసింది. హౌస్‌లో ఉండలేకపోతున్నానని, తనకు ఆకలి కూడా వేయడం లేదని, ఆరోగ్యం దెబ్బతిందని, తనని ఇంటికి పంపేయాలని కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో డాక్టర్స్‌ ఆమెకు పరీక్షలు చేశారు. గంగవ్వ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఇంటి నుండి బయటకు పంపేయడానికి నిర్వాహకులు నిర్ణయించుకున్నారు.
ఈ శనివారం గంగవ్వ బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటకు వచ్చేసింది. ఆమెకు ఇల్లు కట్టిస్తానని బిగ్‌బాస్‌ తరపున నాగార్జున మాటిచ్చారు. గంగవ్వ కాకుండా మరో ఎలిమినేటర్‌ ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌ నుండి బయటకు వస్తారో, రారో చూడాలి.