వారిపై వివక్ష ఎందుకు? ..రాహుల్‌గాంధీ

వాస్తవం ప్రతినిధి: హథ్రాస్‌ ఘటనపై యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. దళితులు, ముస్లింలు, గిరిజనులను దేశంలో చాలామంది మనుషులుగా గుర్తించడం లేదని, ఇది సిగ్గుపడాల్సిన వాస్తవమని రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. అగ్రకులాకు చెందిన నలుగురు వ్యక్తులు దళిత యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎవరూ అత్యాచారానికి గురి కాలేదని యుపి సిఎం, పోలీసులు పదేపదే చెబుతున్నారని, బాధితురాలు ఎవరికి ఏమీ కాదని ఆయన ధ్వజమెత్తారు.