వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ నుంచి కాన్పూరుకు వస్తున్న బస్సు బోల్తాపడిన దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ జిల్లా టప్పాల్ ప్రాంతంలో ఢిల్లీ నుంచి కాన్పూరుకు వస్తున్న ప్రయాణికుల బస్సు ఈ ఉదయం బోల్తాపడింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు. .