చరణ్ అంత పని చేయొద్దు అంటున్న ఫ్యాన్స్..!!

   వాస్తవం సినిమా:  మెగాస్టార్ తనయుడిగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ రీతిలో రాణిస్తున్నారు. రెండో సినిమా “మగధీర” తో ఇండస్ట్రీ హిట్  అందుకొని తన లో ఉన్న టాలెంటెడ్ నటుడిని బయటపెట్టి వెండితెరపై అనేక అద్భుతాలు చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం” సినిమాలో రామ్ చరణ్ నటించిన నటనకు చాలా మంది ఇండస్ట్రీలో లెజెండ్రీ నటులు ఫిదా అయిపోయారు. కాగా ఒక పక్క హీరోగా సక్సెస్ సాధించుకుంటూనే మరోపక్క నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. తండ్రి చిరంజీవి సినిమా ఫీల్డ్ లోకి రీ ఎంట్రీ తర్వాత చేస్తున్న సినిమాలని నిర్మిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా అయిన తర్వాత రామ్ చరణ్ ఫ్లాప్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తో సినిమా చేస్తున్నట్లు తాజాగా ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వార్త విని మెగా ఫ్యాన్స్ వద్దు బాబోయ్ అంత పని చేయొద్దు..  చరణ్ అంటూ దండం పెడుతున్నారు. శ్రీకాంత్ అడ్డాల కి సరైన హిట్ లేదు.  అనవసరంగా ప్రయోగాలు చేయొద్దు అంటూ సూచిస్తున్నారు.