రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ కి భారత్ లో బ్రేక్..!!

వాస్తవం ప్రతినిధి: రష్యాకు చెందిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌గా రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ నమోదైందని అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రకటించిన కొద్దివారాల అనంతరం వ్యాక్సిన్‌ విస్తృత పంపిణీకి రంగం సిద్ధమైంది. అయితే, రష్యా సరైన పరీక్షలు చేయకుండానే వ్యాక్సిన్‌ను తీసుకొస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా..రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై భారత్‌లో భారీ స్థాయిలో ట్రయల్స్‌ నిర్వహించాలనుకున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌కు చుక్కెదురైంది. ఈ మేరకు ఆ సంస్థ చేసిన ప్రతిపాదనను కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ(సీడీఎ్‌ససీఓ) తోసిపుచ్చింది. “వ్యాక్సిన్‌ భద్రత, రోగనిరోధకతపై విదేశాల్లో నిర్వహించిన అధ్యయనాలు చాలా చిన్నవి. వాటిపై సమాచారం చాలా తక్కువగా ఉంది” అని సీడీఎ్‌ససీఓ ప్యానెల్‌ వ్యాఖ్యానించింది. తొలుత చిన్నస్థాయిలో పరీక్షలు నిర్వహించాలని డాక్టర్‌ రెడ్డీ్‌సకు సూచించిం ది.