ఆసియా దేశాలు ప్రమాదంలో ఉన్నాయి : WHO

వాస్తవం ప్రతినిధి: ఆగ్నేయ ఆసియా దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆ దేశాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అందరూ సమష్టిగా కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పిలుపునిచ్చింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే వాటిని సమర్థవంతంగా పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని దేశాలను కోరింది.

‘ప్రపంచంలోని ఇతర దేశాల్లోలాగే ఆగ్నేయ ఆసియా దేశాలు ప్రమాదంలో ఉన్నాయి. కొవిడ్‌-19 వ్యాప్తిని ఆపడానికి బలమైన నాయకత్వం, పకడ్బందీ ప్రజారోగ్య చర్యలు, స్పష్టమైన కమ్యూనికేషన్‌ ఉండాలి.’ అని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయ ఆసియా రీజియన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు.