మహేష్ -రాజమౌళి మూవీ లేటెస్ట్ అప్డేట్…??

వాస్తవం సినిమా:  దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో ఈ కాంబినేషన్ గురించి తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న తరుణంలో లాక్ డౌన్ సమయంలో… “RRR” తర్వాత నెక్స్ట్ మహేష్ తో సినిమా అని రాజమౌళి క్లారిటీ ఇవ్వటం జరిగింది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది దసరా పండుగకు షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఇండస్ట్రీలో తాజాగా ఓ సరికొత్త వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్క్రిప్ట్ వర్క్ విజయేంద్రప్రసాద్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ కూడా ప్రస్తుతం చేస్తున్న “సర్కారు వారి పాట” సినిమా వచ్చే ఏడాది దసరా ముందు కంప్లీట్ చేయడానికి… పక్కా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారట. దీంతో వచ్చే దసరా ముందు అటు రాజమౌళి ఇటు మహేష్ బాబు చేతిలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసి… అప్పుడు సినిమా స్టార్ట్ చేయనున్నట్లు ఆ తర్వాత 2022 సంక్రాంతికి సినిమా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టాక్.