న్యాయమూర్తులపై దూషణల కేసు లో  ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం ! 

వాస్తవం ప్రతినిధి: న్యాయమూర్తులపై దూషణల కేసు లో  ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకొంది. ఏపీ హైకోర్టు తీర్పులపై కొద్దిరోజులుగా  వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. స్వయంగా స్పీకర్ తమ్మినేని సీతారం సైతం హైకోర్టు తీర్పులపై కామెంట్ చేశాడు. ఇంకొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వ్యాఖ్యలు చేశారు.
అయితే దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యి కేసులు పెట్టమని ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోవడంతో  న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో బయట చేసిన వ్యాఖ్యలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని హైకోర్టు గురువారం అభిప్రాయపడింది. స్వతంత్ర్య సంస్థగా సీబీఐ ఉందని.. దానికి దేశవ్యాప్తంగా శాఖలు ఉన్నాయని.. తదితర కారణాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు తెలిపింది.
ఈ పరిణామం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీఐడీకి కూడా మేలు చేస్తుందని.. దానిని ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదని హైకోర్డు అభిప్పాయపడింది. అలాగే సీఐడీపై తమ ఉత్తర్వుల్లో ఎలాంటి దురుద్దేశాలను నిందలను మోపబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక న్యాయమూర్తులపై దూషణల కేసును సీబీఐకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అడ్వకేట జనరళ్లు హైకోర్టుకు నివేదించారు.