పవన్ కళ్యాణ్ తో రానా..??

    వాస్తవం సినిమా: అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా ఆడియో వేడుకలో రానా పవన్ ను ఉద్దేశించి పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది. తాను దగ్గుబాటి స్టూడియో నుండి వచ్చినట్లు పంజా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయటానికి రానా రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే పవన్ ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అదికూడా ఓ రీమేక్స్ సినిమా .. మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన “అయ్యప్పన్నుమ్ కొషియుమ్” ప్రాజెక్టును తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇందుకు సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు.