ఆ చానెళ్లు క్షమాపణ చెప్పాల్సిందే: సంజయ్ రౌత్

వాస్తవం ప్రతినిధి:  సుశాంత్ సింగ్ కేసులో ఆయనది హత్య కాదని, ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం తమ నివేదికలో స్పష్టం చేసిన నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ కొంతమంది రాజకీయ నాయకుల మీద, న్యూస్ ఛానెళ్ల మీద విరుచుకపడ్డారు. ఈ కేసులో ముంబై పోలీసులను, ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ఈ నేతలు, చానెళ్లు క్షమాపణ చెప్పాలని ఆయన  డిమాండ్ చేశారు.  ఈ కుట్రకు పాల్పడినవారిపై ప్రభుత్వం పరువు నష్టం దావా వేయాలని ఆయన కోరారు. సుశాంత్ కేసుకు సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తాకు ఏ రాజకీయ పార్టీతోను సంబంధం లేదని సంజయ్ తమ ‘సామ్నా’ పత్రికలో తెలిపారు. కొందరు పొలిటిషియన్లు ., చానెళ్లు కుక్కల్లా మొరిగారని, వారంతా ఇప్పుడేమంటారని ఆయన తీవ్రంగా  ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని, ముంబై పోలీసు శాఖను తప్పు పట్టినవారిని ఏం చేయాలని కూడా ఆయన అన్నారు.