వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రముఖుల నుండి రాజకీయ నేతల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. రానురాను కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా తెలంగాణ మాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి గత వారం కరోనాబారినపడ్డారు.
దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా సోకిందని తనను కలిసివారంతా కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని, హోంక్వారంటైన్లోకి వెళ్లాలని ఆయన సూచించారు.అయితే ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్టు తెలుస్తోంది. ఆరోగ్యపరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఆయన చికిత్స పొందుతోన్న ఆస్పత్రిలోనే ఇంటెన్సివ్ కేర్‌కు తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు దీంతో నాయిని ఆరోగ్యపరిస్థితిపై ఆయన అభిమానులు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.