వాస్తవం ప్రతినిధి: పెట్రోలింగ్ చేస్తున్న భారత జవాన్లపై టెర్రరిస్టులు కాల్పులకు దిగిన ఘటన సౌత్ కశ్మీర్‌లోని పంపోర్‌లో సోమవారం జరిగింది. టెర్రరిస్టుల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందగా, ముగ్గురు గాయాలపాలయ్యారని సమాచారం. పెట్రోలింగ్ చేస్తున్న జవాన్లపై ఒక్కసారిగా టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. సెక్యూరిటీ ఫోర్సెస్‌పై అటాక్ జరగడంతో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. గాయపడిన జవాన్లను సెక్యూరిటీ ఫోర్సెస్ ఆస్పత్రికి తరలించారు.