ఐపీఎల్‌లో..చెప్పింది చెప్పినట్లుగానే ..చెన్నై అదుర్స్ ! 

వాస్తవం ప్రతినిధి:   దుబాయ్‌లో జరుగుతోన్న ఐపీఎల్‌లో నిన్న పంజాబ్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్ నిర్దేశించిన 179 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై సునాయాసంగా ఛేదించింది. మరో ఓపెనర్ డుప్లెసిస్ తో కలసి చెన్నై ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ చెలరేగి ఆడడంతో విజయం ఆ జట్టు సొంతమైందని చెప్పుకోవచ్చు.
ఆయన 53 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ జరగడానికి ముందు ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ తీరు ఎలా ఉంటుందన్న విషయంపై ఆయన అంతకుముందే ట్వీట్ చేశాడు.
అసలైన చెన్నై ఆట రాబోతోంది అని ఆయన రెండు రోజుల క్రితం పేర్కొన్నారు. చెప్పింది చెప్పినట్లుగానే చెన్నై అదుర్స్ అనిపించింది. అంతకు ముందు జరిగిన మ్యాచుల్లో ఓటములను చవిచూసి విమర్శల పాలైన చెన్నై పంజాబ్‌పై గెలవడంతో ఆ జట్టుకు ఊరట లభించింది.