హఠాత్తుగా విషమించిన తేజ్‌ప్రతాప్ యాదవ్ ఆరోగ్యం

వాస్తవం ప్రతినిధి: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ ఆరోగ్యం శనివారం హఠాత్తుగా క్షీణించింది. శనివారం ఉదయం ఆయన గృహంలో ఉన్నట్టుండి హఠాత్తుగా మూర్ఛతో కిందపడిపోయినట్లు సమాచారం. దీనిని వెంటనే గమనించిన కార్యకర్తలు, నేతలు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి రబ్రీదేవి, సోదరుడు తేజస్వీ యాదవ్ ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.