సంక్రాంతికి వస్తున్న రామ్..!!

వాస్తవం సినిమా: రామ్ వరుస పరాజయాలలో ఉన్న సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో “ఇస్మార్ట్ శంకర్” సినిమా చేసి అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో “రెడ్” అనే సినిమాని చేస్తున్నాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రెండు డిఫరెంట్ పాత్రలో రామ్ నటిస్తున్న ఈ “రెడ్” ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే మహమ్మారి కరోనా వైరస్ రావటంతో వాయిదా పడింది. ఇలాంటి తరుణంలో ఓటిటి లో రిలీజ్ అవుతుందని మొన్నటి వరకు వార్తలు రాగా, తాజాగా రామ్ ఈ సినిమాని నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. గతంలోనే అనుకున్నా కానీ మధ్యలో ఓటీటి లో విడుదల చేయాలని డిసైడ్ అయిపోయినట్లు, అంతా ఓకే అయినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో తాజాగా ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అప్పటికి కరోనా ప్రభావం తగ్గుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.