అమెరికాలో ఏపీ వాసి గుండెపోటుతో మృతి..!

వాస్తవం ప్రతినిధి:  న్యూజెర్సీలోని ప్లేయిన్స్‌బొరోలో  ఓ ఇండియన్ గుండెపోటుతో మృతిచెందారు. ఏపీలోని అనంతపూర్‌కు చెందిన మసూద్ అలీ(40) గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మసూద్‌కు భార్య ఆయేషా, 7 ఏళ్ల కుమార్తె అర్షియా ఉన్నారు. కుమార్తె అర్షియా పుట్టినరోజు(అక్టోబర్ 1) కావడంతో సాయంత్రం బెలూన్లతో అలంకరించడానికి తన అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన కొద్దిసేపటికే గుండెపోటుతో అతను తన అపార్ట్మెంట్ ముందే కుప్పకూలిపోయారు. దాంతో మసూద్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మసూద్ అలీ మరణించారు.