“నిశ్శబ్దం” -రివ్యూ

నటీనటులు: అనుష్క శెట్టి, ఆర్ మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలినిపాండే,సుబ్బరాజు

డైరెక్టర్: హేమంత్ మధుకర్.

మ్యూజిక్ డైరెక్టర్: గోపీసుందర్.

“బాహుబలి” భారీ విజయంతో మంచి గుర్తింపు పొందిన వారిలో అనుష్క కూడా ఉంది. కానీ ఆ సినిమా తర్వాత చేసిన “సైజ్ జీరో” ఆమె కెరీర్ ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది. ప్రయోగాత్మకంగా చేసిన ఈ ఎక్స్పరిమెంట్ దెబ్బకి అనుష్కకి అవకాశాలు ఉన్న కొద్ది తగ్గిపోయాయి. ఇటువంటి తరుణంలో మరో ప్రయోగాత్మక చిత్రంగా “నిశ్శబ్దం” సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన అనుష్కకి సినిమా థియేటర్లు ఓపెన్ కాకపోవటం ఆమెను మరింత నిరాశకు గురి చేసింది. ఇటువంటి తరుణంలో సినిమా ధియేటర్లు ఓపెన్ అయ్యాక ఈ సినిమా రిలీజ్ అవుతుందని “నిశ్శబ్దం” సినిమా యూనిట్ లాక్ డౌన్ సమయంలో క్లారిటీ ఇవ్వగా, ఉన్న కొద్దీ థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవటంతో సినిమా యూనిట్ ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో తాజాగా రిలీజ్ చేసింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమాని హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా విషయానికొస్తే….

స్టోరీ :-

1973 అమెరికాలోని సియాటిల్ నగరంలో ఓ విల్లాలో ఓ జంట చనిపోవడం జరుగుతుంది. దీంతో ఆ భవనంలో దెయ్యం ఉందని అందువల్లే ఆ జంట చనిపోయిందని చుట్టుప్రక్కల వారు భావిస్తారు. ఈ పరిణామంతో ఆ భవనాన్ని దెయ్యాల భవనంగా చూస్తారు. అయితే 2019లో ఒక పెయింటింగ్ కోసం అంతోని (మాధవన్) అండ్ సాక్షి (అనుష్క) ఆ పాడుబడ్డ భవనంలో కి వెళ్తారు. అయితే ఈ పాడుబడ్డ భవనం లో మాధవన్ చనిపోతాడు. 1973 మాదిరిగానే ఆ జంటలో ఆ వ్యక్తి చనిపోయినట్లు ఆంటోని (మాధవన్) చనిపోతాడు. కానీ సాక్షి (అనుష్క) మెల్లగా అక్కడ నుంచి ఎలాగోలాగ తప్పించుకుంటది. అసలు ఆంటోనీ ని ఎవరు చంపారు? ఆ భవనంలో ఏమి ఉంది ? అనుష్క ఎలా తప్పించుకుంది అనే ఈ కేసును పరిష్కరించడానికి అంజలి డిటెక్టివ్ గా కనబడుతోంది. అంజలి కి తోడుగా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ “కిల్ బిల్” ఫేమ్ మైకేల్ మ్యాడ్స్సన్ తోడుగా ఉంటాడు. మధ్యలో సుబ్బరాజు, శాలిని క్యారెక్టర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అయితే వీళ్లంతా కలిసి ఈ కేసును ఎలా సాల్వ్ చేస్తారు అనేది తెలుసుకోవాలంటే “నిశబ్దం” సినిమా చూడాల్సిందే…

పాజిటివ్స్ :-

మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ అద్భుతమైన బాణీలను అందించాడు. మెలోడీ మ్యూజిక్ ఇవ్వటంలో ఇండస్ట్రీలోనే స్పెషలిస్ట్ గా గోపీసుందర్ త్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా డిఫరెంట్ గా అందించాడు. కొన్ని సన్నివేశాలకు గోపి సుందర్ ఇచ్చిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే ఛాయాగ్రహణం. తీసేటప్పుడు అక్కడ ఉన్న అందమైన లొకేషన్లను చాలా చక్కగా వాడుకుని ఫ్రేమ్ త్రిల్లింగ్ గా… సినిమా చూసే ప్రేక్షకుడికి భయం కలిగించే రీతిలో సినిమాటోగ్రాఫర్ కూడా చాలా చక్కగా మంచి ఫీల్ సినిమా పై ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో వర్క్ అందించాడు.

నెగిటివ్స్ :-

సినిమా స్టోరీ రాసుకోవడంలో డైరెక్టర్ మరియు రైటర్ ఫెయిల్ అవ్వడం జరిగింది. చాలా రొటీన్ స్టోరీని ఎంచుకుని ఈ స్టోరీ ని రూపొందించినట్లు తెలుస్తోంది. సినిమా స్టోరీ చూస్తే “మన్మధ” తో పాటు మరికొన్ని సౌతిండియా సినిమాల కలయిక తరహాలో ఈ మర్డర్ మిస్టరీ స్టొరీ హేమంత్ మధుకర్ రాసుకున్నట్లు అర్థం అవుతోంది. సినిమా కథనం అస్సలు బాగోదు. అనుష్క క్యారెక్టర్ ని కొంచెం కూడా హైలెట్ గా చూపించిన సందర్భాలు గాని సన్నివేశాలు గానీ సినిమాలు లేవు. అసలు అనుష్క క్యారెక్టర్ చూస్తే….ఈ సినిమాని అనుష్క ఒప్పుకుందా..? లేకపోతే ఆమె అసిస్టెంట్ ఒప్పుకున్నాడా..? అని అనిపిస్తుంది. సినిమా ఫైనల్ లో అనుష్క హైలెట్ అవుతుందని అందరూ భావిస్తారు కానీ చివరాఖరికి సినిమా అయిపోతుంది ఏమీ ఉండదు. అనవసరమైన డైలాగులు, ఆకట్టుకోని నటన, బోర్ కొట్టే సన్నివేశాలు…. ఒక్క సీన్ కి మరొక సీన్ కి మధ్య అస్సలు సింక్ ఉండదు. అదేవిధంగా డైరెక్టర్ శాలిని పాండే డైరెక్టర్ కి కూడా జస్టిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారు.

మొత్తంగా చూసుకుంటే:-

థ్రిల్లర్ నేపథ్యంలో ఇండియాలో తెరకెక్కే సినిమాలకు ఏదో కోణంలో ఫెయిల్యూర్ కనబడుతూ ఉంటుంది. అయితే స్టార్ రచయిత కోన వెంకట్ వంటి వారు మరియు హేమంత్ మధుకర్ లాంటి డైరెక్టర్ కలయికలో అనుష్క, మాధవన్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్న అంజలి, శాలిని పాండే , సుబ్బరాజు వంటి బలమైన నటీనటులు ఉన్న ఈ సినిమా కనీస స్థాయి కూడా అందుకోలేకపోయింది. ఒకవేళ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయి ఉండి ఉంటే….సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇది “నిశ్శబ్దం” కాదు నీరసం అనే కామెంట్లు చేయడం గ్యారెంటీ. కారణం అసలు ముందు సినిమా కథలో పెద్దగా కంటెంట్ లేదు. రొటీన్, బోరింగ్ స్క్రీన్ ప్లే తో చాలా బలహీనమైన స్టోరీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్కిప్ చేయటం మంచిది. ఇప్పటివరకు తెలుగులో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన ఏ ఒక్క సినిమా కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకోకపోవడం… జరిగింది. తాజాగా నిశ్శబ్దం కూడా ఆ కోవలోకే వచ్చిన సినిమా అనే టాక్ బయట వినబడుతోంది.

………….పాంచజన్య